సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత్ జరిపిన దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుండి మరో దేశంగా విభజన కోరుకొంటున్న బెలూచిస్తాన్ లో ప్రజలు బెలూచిస్తాన్ పోరాట యోధులు, ఆప్ఘనిస్తాన్ పౌరులు డాన్సులు చేస్తూ పండుగ చేసుకొన్నారు. ఇప్పటికే బెలూచిస్తాన్ యోధులు ఎందరో పాక్ సైనికులును చంపి,వందలాది మందిని బందీలు చేసుకొని ఒక జిల్లాతో పాటు పలు పట్టణాలు,ప్రభుత్వ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ పాక్ సైన్యం అడుగుపెట్టకుండా ఎదురుదాడులు చేస్తున్నారు. సుమారు 50 మంది పాక్ సైనికులను బట్టలు విప్పి కూర్చోబెట్టడం కూడా జరిగింది. మరి కొద్దీ రోజులలో పాకిస్తాన్ భూభాగంలో 40 శాతం పైగా ఉన్న బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించడం ఖాయంగా పరిశీలకులు భావిస్తున్నారు. తాజగా నేడు గురువారం అందిన సమాచారం ప్రకారంబెలూచి యోధులు జరిపిన రెండు దాడుల్లో 14 మంది పాక్ ఆర్మీ హతమయ్యారు. బిలాన్లోని మాచ్‌లోని షోర్కాండ్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనిక కాన్వాయ్‌పై బీఎల్ఏ రిమోట్ క్రంటోల్ ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది పాక్ సైనికులు మరణించారు. మరణించిన సైనికుల్లో స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ తారిక్ ఇమ్రాన్, సుబేదర్ ఉమర్ షరూక్ ఉన్నారు. ఈ పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. కచ్‌లోని కులాగ్ టిగ్రామ్ ప్రాంతంలోమరో ఇద్దరు పాక్ సైనికులను హతమార్చారు.మరోవైపు నేటి గురువారం ఉదయం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో 3 వరుస పేలుళ్లు జరిగాయి. లాహోర్ వాల్టన్ రోడ్‌లోని సైనిక విమానాశ్రయం వెలుపల మూడు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లను పాకిస్థాన్ అధికారులు ధృవీకరించారు. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) శిక్షణా విన్యాసాల సమయంలో జరిగిన ప్రమాదంలో ? పేలుళ్లు సంభవించాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ పేలుళ్లతో లాహోర్ ఎయిర్‌పోర్టును మూసివేశారు. పరుగులు తీస్తున్న పాక్ ప్రజల భయాందోళన కు అంతులేకుండా ఉంది.
