సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాదంతో భారత్ లో జరుగుతున్నా దాష్టికాలను అడ్డుకొనేందుకు పాక్ ఫై ఇటీవల భారత్ జరిపిన దాడి ని సింధు జలాల నిలిపివేతకు గట్టి కారణాలు ప్రపంచానికి తెలపడానికి ప్రధాని మోడీ ప్యూహాత్మక అడుగులలో భాగంగా దాదాపు 60 దేశాలలో భారత్ లో బీజేపీ తో సహా అన్ని రాజకీయ పార్టీల మేధావి వర్గం ప్రజా ప్రతినిధులతో 6 టీమ్ ల క్రింద పర్యటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశిరుద్ , ఎం ఐ ఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసవుద్దీన్ ఒవైసి తమ మాటల పదునుతో పలు దేశాలలో భారతీయ వాదనను వినిపిస్తూ తమ సత్తా చాటుతున్నారు. వీరి వాదనతో దాదాపు అన్ని దేశాలు అంగీకరిస్తూ భారత్ కు మద్దతు పలుకుతుండటం విశేషం. ఇదిలా ఉండగా తాజగా.. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండ నేతృత్వంలోని అసద్ టీం ఇవాళ అల్జీరియాలో పర్యటిస్తోంది.ఈ క్రమంలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అల్జీరియాలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దక్షిణ ఆసియాలో పాకిస్థాన్ చేస్తున్న నీచపు పనుల్ని వివరించారు. పాకిస్తాన్ ఉన్న కీలక ఉగ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ ప్రత్యేకంగా చూసుకుంటున్న తీరును విమర్శించారు. ప్రపంచంలో ఏ దేశమూ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదిని జైలు నుండి బయటకు రావడానికి అనుమతించదు. కానీ అతను జైలులో ఉండగానే ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు.” అని అసదుద్దీన్ తెలిపారు.ఉగ్రవాద దేశం పాకిస్తాన్‌కు ఎవ్వరు అప్పులు ఇవ్వకూడదని దానిపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఉంచితేనే ప్రపంచానికి శాంతి చేకూరుతుందని గత 2018లో పాకిస్తాన్‌నుప్రపంచం గ్రే లిస్ట్‌లోకి తీసుకువచ్చిన తర్వాత భారతదేశంలో ఉగ్రవాదం తగ్గుదల చూశామని అసద్ గుర్తు చేసారు. పాకిస్థాన్ తనకు ఇతర మతస్తులను చంపటంలో మతపరమైన అనుమతి ఉందని భావిస్తోంది. కాని ఇది పూర్తిగా తప్పు. ఇస్లాం ఏ వ్యక్తినీ చంపడానికి అనుమతించదు. దురదృష్టవశాత్తు అదే పాకిస్తాన్ సిద్ధాంతం” అని అసద్ పేర్కొనడం విశేషం. మొత్తానికి హిందూ ద్వేషి గా గతంలో తనపై ఉన్న ముద్రను పూర్తీ చెరిపేసుకొనే ప్రయత్నంలో అసద్ ఒక అడుగు ముందే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *