సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆఫ్గనిస్తాన్ భారత్ సంబంధాలు సన్నిహితం కావడం ఓర్చుకోలేని పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ ఫై విమానిక దాడులు చేసి బాంబులు కురిపించడం తో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆప్ఘనిస్తాన్ సైనికులు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద దాడులు చెయ్యడం పలు పాకిస్తాన్ చెక్ పోస్టులను స్వాధీనం చేసుకొని వందలాది పాక్ సైనికులను తన్నుకొంటూ బందీలుగా తీసుకొనిపోతున్న ఘటనలు మీడియాలో చూస్తున్నాం. ఇరువైపులా అనేక మంది మరణిస్తున్నారు. ఇదిలా ఉండగా పాక్ వైమానిక దాడుల్లో ముగ్గురు అప్ఘాన్ క్రికెటర్లు దుర్మరణం చెందడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి.(Afghan Cricketers Killed) ఈ దాడిలో ఉంగూర్ జిల్లాకు చెందిన దేశవాళీ క్రికెట్ ప్లేయర్స్ కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఏసీబీ గత శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనను పిరికిపంద చర్య అని అప్ఘాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తీవ్రంగా ఖండించింది. త్వరలో శ్రీలంక, పాక్‌తో జరగాల్సిన త్రైపాక్షిక టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనపై అప్ఘాన్ టీమ్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా స్పందించాడు. త్రైపాక్షిక సిరీస్‌ నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి మద్దతు తెలిపాడు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *