సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం పెనసం గ్రామం నుంచి పాదయాత్రగా నలుగురు భక్తులు విజయవాడ వెళ్తుండగా కారు భక్తులపై దూసుకెళ్లడంతో నేటి శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది, ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు భవాని భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. వైజాగ్ నుంచి అనపర్తి వెళ్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఈశ్వరరావు (38), సంతోష్ (28)గా పోలీసులు గుర్తించారు. ( పైన సీసీ ఫుటేజ్ దృశ్యాలను చూడవచ్చు)
