సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాన్‌కార్డ్ నంబర్‌కు ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్‌’గా చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్-2023లో కీలక ప్రకటన చేయవచ్చునని జాతీయ మీడియా రిపోర్టులు వస్తున్నాయి. 10-డిజిటల్ అల్ఫాన్యుమరిక్ నంబర్ అయిన పాన్‌కార్డును ఆదాయ పన్ను విభాగం (Income tax department) జారీ చేస్తుంది. ఇకపై, పాన్‌ను ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్‌’ గుర్తించడం ద్వారా వ్యాపారాల పన్ను చెల్లింపులు మరింత సరళీకృతం అవుతాయని కేంద్రం భావిస్తోంది.. ప్రస్తుతం భారత్‌లో వ్యాపారం చేయాలంటే అవసరాలను బట్టి వేర్వేరు ఐడెంటిఫికేషన్ నంబర్లు తీసుకోవాల్సి వస్తోంది. ట్యాక్సుల రిజిస్ట్రేషన్, లోన్ లేదా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్… ఇలా వేర్వేరు ఐడెంటిఫికేషన్ నంబర్లు ఉండాలి. అయితే ఇప్పటికే పాన్‌ను (PAN) పన్ను చెల్లింపుల్లో ఉపయోగిస్తున్నందున.. మున్ముందు వ్యాపార పక్రియ, నిర్వహణ సామర్థ్యాల పెంపునకు బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా పాన్‌ను గుర్తిస్తే మరింత ప్రయోజనకరమని భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.ఆచరణలోకి వస్తే చిన్న- మధ్యతరహా పరిశ్రమలకు (ఎస్ఎంఈలు) ఎక్కువ ప్రయోజనకరంగా ఉండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *