సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: పాన్ – ఆధార్ లింక్ చేశారా? లేదంటే వెంటనే 1000 రూపాయలు ఫైన్ చెల్లించి లింక్ చేయండి’ అంటూ కేంద్రం మార్చి 31,2023 వరకు గడువు విధించింది. లేని పక్ధంలో మీకు చెందిన అన్ని బ్యాంకు , ఇతర ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోతాయి అన్న హెచ్చరికలతో దానితో సమయం సరిపోదని పలువురు ఆందోళనకు గురిఅవుతున్న నేపథ్యంలో,, తాజాగా నేడు మంగళవారం .. ఆ గడువును జూన్ 30,2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపు దారులకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా పాన్ – ఆధార్ లింక్ గడువు పొడిగింపుపై కేంద్రం ఆర్ధిక శాఖ స్పందించింది. జూన్ 30, 2023 లోపు పాన్ -ఆధార్ అనుసంధానం చేయాలని, లేదంటే పాన్ కార్డ్ పని చేయదని స్పష్టం చేసింది.
