సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల నాగార్జున తో కలసి కుబేర సినిమా పంక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇటీవల ‘నాగార్జున హీరోగా కాకపోయినా విభిన్న పాత్రల ఎంపిక చూస్తుంటే ముచ్చట వేస్తుంది. కుబేర లో క్యారెక్టర్ కానీ కూలి లో విలన్ గా చాల దమ్ముగా క్యారెక్టర్స్ ఎన్నుకొంటున్నారు.. నేను త్వరలో ఇదే బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు స్పిరిట్ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాను పవర్ ఫుల్ కథతో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇందుకోసం మెగాస్టార్ ను సంప్రదించారు. చర్చలు జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి. బ్లాక్ బస్టర్ హిట్.. యానిమల్ సినిమాలో రణబీర్ తండ్రి పాత్రలో ఒకనాటి బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ ఒ ఎంత హైలైట్ అయ్యారో తెలసిందే.. ఆ సాంగ్ కూడా సూపర్ హిట్.. . ఇప్పుడు స్పిరిట్ సినిమాలోనూ హీరో తండ్రి పాత్ర హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి చిరంజీవి అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఇప్పటికే వెంకీ మామతో కనిపిస్తున్న చిరు ను త్వరలో మరో అద్భుతమైన కాంబినేషన్ చూడబోతున్నాము..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *