సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయుల విలువలతో కూడిన జీవన విధానం కు రామాయణం ప్రామాణికం.. మరి అటువంటి మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని జీవిత గాధ లోని కొన్ని పర్వాలను తీసుకోని ఇప్పుడు నేటి తరానికి ఆ ‘రామాయణం ’ గొప్ప తనాన్ని చెప్పే బాధ్యతను దర్శకుడు ఓం రావత్ తీసుకొన్నారు. భారీ అంచనాలతో నేడు, శుక్రవారం ఆదిపురుష్ 3డి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీ రాఘవుడు( ప్రభాస్) సీతా, లక్ష్మణ సమేతుడై వనవాసం స్వీకరించడం నుంచి కథ ప్రారంభం అవుతుం ది. రాఘవుడు సత్యం , ధర్మమే తన ఆయుధం గా వనవాసం చేస్తుండగా లంకాధీశుడు లంకేశ్ (సైఫ్ అలీఖాన్) తన సోదరి శూర్పణఖ చెప్పిన మాటలు విని జానకిని అపహరిస్తాడు. అశోకవనం లోబం ధిస్తాడు. తన జానకిని తిరిగి తీసుకొచ్చేందుకు హనుమంతుడు, వానరులు సాయంతో రాఘవ ఏం చేశాడు? ధర్మ యుద్ధం గెలిచిందన్నది మిగతా అందరికి తెలిసిన కథ. ఇక సినిమా ను దర్శకుడు ఓం రౌత్ రామాయణ ఇతిహాసం లోని ప్రామాణికతని పక్క నపెట్టి… అంతర్జాతీయ స్థాయిలో అందరిని ఆకట్టుకొనే సినిమా పరిభాషలో ఆలోచిస్తూ అద్భుతమైన గ్రాఫిక్స్ కు కీలక స్థానం ఇస్తూ సినిమాను తీశారనిపిస్తుంది. సీతారాముల భావోద్వేగాలను పెద్దగా చూపించలేదు. ప్రభాస్ ఆజానుబాహుడైన శాంతి స్వరూపుడు శ్రీ రామునిగా చక్కగా నటించాడు. రావణుడుగా సైఫ్ అలీఖాన్ చాల ఆధునికంగా కనిపించాడు. ఇక హనుమాన్ క్యారెక్టర్ ఆయన సాహసాలు హైలైట్ గా తీశారు. బంగారు లేడి మాయ, రావణుడు సీతాపహరణం , వాలి-సుగ్రీవుల యుద్ధం, హనుమంతుడి తో శ్రీరాముని కలయిక , లంకాదహనం , వానర సైన్యం తో కలిసి సేతు నిర్మాణం కోసం సముద్రుడి ని శ్రీరాముడు ఆదేశించడం, చివరలో అర్ధ గంట పాటు, మేఘనాధుడు యుద్దమ్, రామరావణ యుద్ధం.. హైలైట్స్ .. విజువల్ వండర్ తో భారీ హాలీవుడ్ సినిమా చుసిన భావన కలుగుతుంది. అయితే కధనంలో ప్రేక్షకుడు లీనమయ్యా అవకాశం లేదు. ఈ సినిమా కు సంగీతం నిజంగా పెద్ద హైలైట్. కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ..మొత్తానికి కుటుంబ సమేతంగా సినిమా థియేటర్స్ లో మాత్రమే 3డి లో ఒక్కసారైనా చూడవలసిన సినిమా ఆదిపురుష్.. బాహుబలి వేరు.. ఆదిపురుష్ వేరు అన్న సృహ తో సినిమాకి వెళ్ళితే ప్రేక్షకుడికి చక్కటి అనుభూతి మిగులుతుంది.
