సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకప్పుడు టీనేజ్ యువకుడుగా భీమవరం విధుల్లో తిరిగిన ప్రభాస్’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోవడమే కాదు.. భారతీయ సినిమాలో సగం బిజినెస్ ప్రభాస్ సినిమా .. అనే స్థాయికి ఎదిగిపోయాడు అంటే అద్భుతం కాక మీరేమిటి? బాహుబలి సిరీస్ హిట్స్ తర్వాత ప్రభాస్ రేం జ్ మారిపోయింది. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్, సలార్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ కే, సూపర్ డీలక్స్ (మారుతి సినిమా ) చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలతో ప్రభాస్ దాదాపు రూ.4 వేట కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో ఆదిపురుష్ సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే అవలీలగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 800 నుంచి రూ.1000 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘సలార్’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం రూ. 800-1000 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది. ఇక అశ్వనీదత్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కే...నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ రూపొందిస్తున్నా రు. ఈ చిత్రం బడ్జెట రూ.500 కోట్లు. ప్రపం చ వ్యా ప్తం గా అన్ని భాషల్లోఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు..రూ.2000 కోట్లను కలెక్షన్ల టార్గెట్ తో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక మారుతి దర్శకత్వం వహిస్తున్న సూపర్ డీలక్స్ అనే టైటిల్ ప్రచారం లో ఉన్న మూవీ ఒక్కటే లో బడ్జెట్.. అంటే రూ.200 కోట్లు. రూ.
400 కోట్ల కలెక్షన్ల టార్గెట్ ఈ చిత్రం రాబోతుం ది. ఇలా మొత్తం గా ప్రభాస్ పేరుతో చిత్ర పరిశ్రమలో రూ. 4000 కోట్ల బిజినెస్ జరగబోతుందని భారతీయ సినీ విశ్లేషకులు అంచనా కడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *