సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల 10 కోట్ల తో నిర్మించిన యానిమేషన్ సినిమా గా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా స్థాయిలో అవతార్ నరసింహ సుమారు 400 కోట్లు వసూళ్లు సాధించి శబాష్ అనిపించింది. అదే స్పూర్తితో వరుస పరాజయాలతో సతమత మౌతున్న నిర్మాత సూర్య దేవర నాగవంశీ తన. సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై..స్టార్ హీరోలతో పని లేకుండా వాయు పుత్ర హనుమాన్’ అనే యానిమేషన్ సినిమాను భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దీనికి దర్శకుడిగా వరుస హిట్స్ తో ఇటీవల తండేల్ తో భారీ హిట్ కొట్టిన ‘ చందు మొండేటి దర్శకుడుగా సిద్ధం అయ్యారు. అడ్వాన్స్డ్ 3D యానిమేషన్ కాన్సెప్ట్‌తో…హనుమంతుని కాలాతీత కథను మరింత గొప్పగా ఆవిస్కరించే ప్రయత్నం చేస్తున్నరు . లంక దహనం నేపథ్యంలో నిలబడి ఉన్న హేమంతునితో వాయు పుత్ర పోస్టర్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అతి తక్కువ టైంలో.. 2026లో వేసవి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
