సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల పట్టికలో మొదటి పతకాన్ని నేడు, ఆదివారం బోణి చేసింది. భారత షూటింగ్ స్టార్ మను భాకర్ మహిళల పిస్టల్ 10 మీటర్ల షూటింగ్ క్రీడలో కాంస్య పతకం సాధించింది. 20 ఏళ్ల తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలోఫైనల్ లో అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన మను ఆదివారం జరిగిన తుది పోరులో కూడా అదే జోరుని కొనసాగించింది. గత ఒలింపిక్స్ లో దారుణంగా విఫలమైన మను ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం అత్యుత్తమంగా రాణించింది. షూటింగ్ విభాగంలో మెడల్ సాధించిన తొలి మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో 221.7 పాయింట్లు సాధించిన మనుబాకర్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన ఇద్దరు కొరియన్లకు బంగారం, వెండి పతకాలు దక్కాయి. పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు బోణీ కొట్టింది. న్యూజిలాండ్లో జరిగిన మ్యాచ్లో 3-2తో విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్లో కివీస్ గోల్ కొట్టి ఆధిక్యంలో వెళ్లగా సెకండాఫ్ లో పుంజుకున్న భారత్ స్కోర్ సమం చేసింది. తర్వాత ఇరు జట్లూ చెరో గోల్ కొట్టాయి. చివర్లో ఇండియా మళ్లీ గోల్ చేయడంతో విజయం సాధించింది. భారత్ ప్లేయర్లలో మన్దేప్, వివేక్, హర్మన్హీప్రీత్ లు గోల్ కొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *