సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం 3వ రోజు భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు (Parliament ) ఉదయం నుండి గందరగోళంతో ప్రారంభమయ్యాయి. ఇటీవల దేశంలో పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తీరులో ఈవీఎం ల నిర్వహణ,ఓటింగ్ సరళిఫై ఆరోపణలు ఫై పిర్యాదులు నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రములో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR) అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభలో నినాదాలు, ఆందోళనలతో సభా కార్యకలాపాలు స్తంభించాయి.లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష ఎంపీలను సభ మర్యాదను పాటించాలని కోరినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో లోక్‌సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. .ఈ గందరగోళం మధ్య, స్వాతంత్ర సమరయోధుడు లోక్‌మాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో ఆయనకు నివాళులు అర్పించారు.
