సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలునేడు గురువారం నుంచి నూతన పార్లమెంట్ భవనం లో ప్రారంభమయ్యాయి. . ఈ సమావేశాల్లో దాదాపు 30 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి నేడు, సభలో ప్రధాని మోడీ స్వాందిస్తూ .. మణిపూర్ లో జరుగుతున్నా అల్లర్లకు హత్యలకు, దాష్టికాలకు ( ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన.. మేరకు) నాగరిక సమాజం సిగ్గు పడవలసిన సమయం అని , మణిపూర్ అల్లర్ల వెనుక ఉన్న శక్తుల అణచివేతకు విచారణలో అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. అందరు ఎంపీ లు దేశంలో ప్రస్తుత సమస్యలపై పార్లమెంట్లో చర్చించవలసిన అవసరం ఉందన్నారు. ఇక ఈ సమావేశాల్లో 31 బిల్లులకు ఆమోదం పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే బిల్లు కూడా వీటిలో ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *