సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండోరోజైన నేడు మంగళవారం కూడా పార్లమెంటులో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR)పై విస్తృత చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ ఓం బిర్లా ఇరుపక్షాలు కు ప్రత్యేక సమావేశం లో ఎట్టకేలకు అధికార పక్షం అంగీకరించింది. ఈనెల 8వ తేదీ సోమవారంనాడు తొలుత ‘వందేమాతరం’పై చర్చ జరుగుతుందని, 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ ఉంటుందని తెలిసింది. అంతకు ముందు ఎస్ఐఆర్పై వెంటనే చర్చ జరగాలని ఉభయసభల్లోనూ విపక్షాలు పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితా సవరణ (SIR), ఢిల్లీ పేలుళ్ల ఘటనకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటర్ల సవరణను వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఖడ్గేతో సహా ఇండియా కూటమిలోని ఎంపీలు పాల్గొన్నారు.
