సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో దేశంలో మోడీ లు నుద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫై పడిన పరువు నష్టం కేసు ఫై హైకోర్టు 2 ఏళ్ళు శిక్ష విధించిన తీర్పు ప్రకారం ఎంపీ పదవి కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఆ తీర్పు ఫై సుప్రీం కోర్ట్ ఇచ్చిన స్టే ప్రకారం .. ఎంపీగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణవ్వడంతో నేడు, సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు పార్లమెంట్‌లోకి సాదరంగా ఆహ్వానం పలికారు. కాగా ప్రధాని మోడీపై ఇటీవల విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం రావడం ఇప్పుడు అందరు ఆసక్తిగా చేసున్న కీలక పరిణామమం అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మణిపూర్‌లోని హింసాత్మక ప్రాంతాలను ఇటీవల రాహుల్ సందర్శించడం చర్చలో ఉపయుక్తంగా ఉంటుందని పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది.
