సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ గా ఘన విజయం సాధించాక, కేంద్రము లో ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసాక భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా పాలకొల్లు లో నేడు, శనివారం పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వర్మ కు స్థానిక ఎమెల్య, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు , స్థానిక కూటమి నేతలు ఘన స్వగతం పలికారు. తదుపరి స్వర్గీయ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారి 125వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ, పాల్గొనడం పాలకొల్లు పురప్రముఖుల సమక్షంలో ఘన సత్కారం అందుకోవడం జరిగింది. ఈ సందర్భముగా కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి నిమ్మల గారితో , కూటమి నేతలతో కలసి కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత వాసిగా ఇక్కడి ప్రజల అభివృద్ధి కి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరివారివాడిగా ఉంటానని హామీ ఇచ్చారు.
