సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లులో నేడు, బుధవారం వైసిపి, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రికత్త చోటు చేసుకుంది. దీనితో పోలీసులు నిషేధ ఆజ్ఞలు విధించారు. ‘టిడ్కో ఇళ్ల వద్ద వంటా వార్పు, పాలకొల్లును చూడు’ పేరు మీద నిరసనకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపు నివ్వడంతో స్థానిక వైసిపి శ్రేణులు ఆగ్రహించాయి. పాలకొల్లులో ఎప్పడు ఎదో వంకతో తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి ఎదో అలజడికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ప్రయత్నిస్తున్నారని, ఆయన డ్రామాలు అడ్డుకొనితీరుతామని వైసీపీ నేతలు , కార్యకర్తలు సిద్ధం అయ్యారు. టీడీపీ నిరసనకు పోటీగా వైసీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. టిడ్కో ఇళ్ల వద్దకు వైసీపీ నాయకులు చేరుకుంటున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో నిమ్మల నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎమ్మెల్యే బయటకు రాకుండా గృహ నిర్బంధం విధించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీకి మద్దతుగా జనసేన నాయకులు నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *