సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాబోయ్! రాష్ట్రంలో ఎవరికీ రాని ఐడియాలు ఈయనకే ఎలా వస్తాయి? అనిపిస్తుంది.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడ్ని చుస్తే.. .పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుధ్య కార్మికులతో కలిసి వార్డుల్లో నేడు, గురువారం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పారిశుధ్య పనులు చేసి వినూత్న నిరసన తెలిపారు. టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఉచితంగా ఇవ్వనందుకు నిరసనగా తాను నేటి ఉదయం ఇంటింటికి పేపర్ వేసి , చెత్తకుప్పలు ఎత్తి పారిశుధ్య పనులు చేసి నిరసన తెలిపినట్లు ఆయన ప్రకటించారు. పేదలకు టిడ్కో గృహాలను ఉచితంగా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మోసం చేశారన్నారు. పాలకొల్లులో గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే 100 శాతం పూర్తయిన కొన్ని ఇళ్ళకే రంగులు వేసి లబ్దిదారులకు ఇచ్చారని ఆరోపించారు. పాలకొల్లు పట్టణ వాసులకు పెద్దగరువు ప్రాంతంలో నిర్మించాల్సిన 640 టిడ్కో గృహాలను రద్దు చేసారని ఆరోపించారు. నిరు పేదలకు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కానీ భూములలో సెంటు పట్టాని ఇచ్చి మోసం చేసారని ’’ అని రామానాయుడు ఆరోపించారు
