సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో తమ సంస్థలకు చెందిన ఆస్తుల్లో కొంత స్థలం నిరుపయోగంగా ఉండడంతో ఈ–అక్షన్‌ ద్వారా విక్రయానికి పెట్టామని బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌.శ్రీను (ఏలూరు) తెలిపారు. స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థకు చెందిన పాలకొల్లులో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో విజయ ఆర్ధో ఆసుపత్రి వెనుక భాగంలో పడమర, దక్షిణం రోడ్లు కలిగిన ఎం.1.03 సెంట్ల స్థలం ఖాళీగా ఉండటంతో గజం రూ.22 వేలు విలువైన ఆ స్థలాన్ని ఈ–ఆక్షన్‌ ద్వారా ఈనెల 13న బిడ్‌ తెరిచామని, జూలై ఒకటో తేదీ సాయంత్రం మూడు గంటల వరకూ బిడ్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేసుకోవచ్చ న్నారు. జూలై 2వ తేదీన బిడ్స్‌ ఓపెన్‌ చేస్తామన్నారు. వివరాలకు 94906 44555, 94901 22622, 94235 65008 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *