సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు అరెస్ట్.. విజయవాడ తరలింపు పరిణామాలతో తెలుగు దేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళన కు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు కీలక నేతలను గృహ నిర్బంధం చేసారు. జిల్లా కేంద్రం భీమవరం తదితర పట్టణాలలో ప్రధాన సెంటర్లలో పోలీస్ భద్రతా పెంచారు. ఈ నేపథ్యంలో పాలకొల్లు ఎమ్మె ల్యే నిమ్మ ల రామానాయుడు అస్వ స్థతకు గురయ్యారు. చం ద్రబాబుఅరెస్టు నేపథ్యంలో.. పాలకొల్లులోని ఎమ్మెల్యే నిమ్మల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటివద్దకు పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులతో వాదనకు దిగిన నిమ్మల రామానాయుడు అకస్మాత్తుగా నిరసించి కిందపడి అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో రామానాయుడికి ఏం జరిగినా పోలీసులదే బాధ్య తం టూ నినాదాలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *