సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ఉండిలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం , పోలీసులను అడ్డుకోవడం, ప్రజా సమీకరణ చేసి రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం , విద్యుత్తు ఉపకేంద్రాన్ని ముట్టడించడం,వంటి చట్ట ఉల్లంఘన పనులుకు పాల్బడ్డారని ఉండి పోలీసు స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో పాలకొల్లు లో ఎమ్మెల్యే కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నిమ్మల మీడియా తో మాట్లాడుతూ.. ఆక్వా రైతులకు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉండి నియోజకవర్గంలో గతంలో ప్రశ్నించినందుకు జగన్ సర్కార్ తనపై అక్రమకేసులు పెట్టించారని ఆరోపిస్తూ ..ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవ్వాలని నోటీసులు లో పేర్కొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *