సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని కుళాయి చెరువులో మునిగిపోయి మితకాని హరికృష్ణ (17) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుళాయి చెరువు సమీపంలోని తోటలో ముగ్గురు యువ కులు గత సోమవారం సాయంత్రం కర్ర, బిళ్ల ఆడు కుంటున్నారు. కర్రతో కొట్టిన బిళ్ల కుళాయి చెరువులో పడడంతో ముగ్గురు యువకులు 12 అడుగుల లోతు ఉన్న చెరువులో దిగారు. ముగ్గురు కలిసి గూటి బిళ్లను తీస్తుండగా ప్రమాదవశాత్తు మితకాని హరికృష్ణ గల్లంతయ్యాడు. మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరు కుని స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత రాత్రి జరరేటర్ సహాయంతో లైట్లు వెలిగించి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి రాత్రి యువకుడి మృతదేహం లభ్యమైంది.
