సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో విష జ్వరాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి విడుదల రజని మాట్లాడుతూ .. రాష్ట్రంలో సమర్ధవంతంగా విష జ్వరాలను అదుపులో పెడుతున్నామని, ఆరోగ్యశ్రీ లో డెంగ్యూ, మలేరియా జ్వరాలను కూడా చేర్చి పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో పాలకొల్లు కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పటంలేదని, తన నియోజకవర్గంలో డెంగ్యూ వల్ల ఎనిమిది మంది చనిపోయారని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో దోమలు పెరగకుండా ఫాగింగ్, స్ప్రే చేసేవారని.. కానీ ఇప్పుడు ఎక్కడ అవి లేవన్నారు. చెత్త పన్ను వేస్తున్నారని.. కానీ తన నియోజక వర్గంలో చెత్త తీసుకు వెళ్ళడం లేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ లో విషజ్వారాలు చేర్చామంటున్నారని… అయితే అది రోగి వెంటిలీటర్ మీదుకు వెళితేనే వర్తిస్తుంది అంటున్నారన్నారు. ప్లేట్ లెట్స్ దోరక్కపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారని నిమ్మల రామానాయుడు సమస్య సభ దృష్టికి తెచ్చారు.
