సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాల కాలంగా పేమ వ్యవహారాలలో సైకోలు గా మారిన యువకులు యువతులపై కత్తులతో దాడి కి దిగటం లేదా యాసిడ్ దాడి చేసిన కేసులు గతంలో చాల జరిగాయి అయితే దానికి బిన్నంగా విజయవాడకు చెందిన యువతే భీమవరం సమీపంలోని పాలకోడేరు లోని యువకుడి ఫై యాసిడ్ దాడి యత్నించిన సంచలన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పాలకోడేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరుకు చెందిన జయకృష్ణ అనే యువకుడు భీమవరం, నర్సాపురం, రాజమండ్రిలలో పలు దుస్తుల షాపుల్లో సేల్స్ మన్, మేనేజర్ గా పనిచేసేవాడు. 2023 నుంచి విజయవాడలో ఒక క్లాత్ షో రూమ్ లో మేనేజర్ గా పనిచేసాడు. అదే షాపులో పనిచేస్తున్న విజయవాడకు చెందిన మహిళతో సాన్నిహిత్యం పెరిగింది.అయితే, ఆ అమ్మాయి ఆర్థిక పరిస్తితి బాగాలేదని, కష్టాలలో ఉన్న ఆ యువతికి పలు దఫాలుగా రెండు లక్షల నలభై వేలు అప్పుగా ఇచ్చానని, డబ్బులు అడిగినందుకు గత నెల 6 వ తేదీన పాలకొడేరు కు ఆమె బురఖా వేసుకొనివచ్చి వచ్చి తనపై యాసిడ్ దాడి చేసిందని అయితే తాను తృటిలో తప్పించుకొన్నానని పాలకొడేరు పోలీసులకు ఫిర్యాదు చేసాడు జయకృష్ణ.. అతని ఫిర్యాదు మేరకు పాలకొడేరు పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే, ట్విట్స్ ఏమిటంటే.. జయకృష్ణ తనపై అత్యాచారం చేసాడని విజయవాడ పడమట పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు.ఒకే లింక్ ఉన్న ఈ వేర్వేరు ఘటనలపై విజయవాడ, పాలకోడేరు ల్లో కేసులు నమోదు అయ్యాయి. దీనిలో అసలు తప్పు ఎవరు చేసారో ?ఎవరు తప్పించుకోవాలని చూస్తున్నారో ? పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
