సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ పటాన్‌చెరులోని పాశమైలారంలో నిన్న సోమవారం జరిగిన సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు ఘటన లో మృతుల సంఖ్యా మరింత పెరగటంతో అది దేశంలోనే ఒక పెను విషాద ఘటనగా మారింది. నేటి మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 45 మంది కార్మికులు మృతిచెందారు. మరో 33 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేటి ఉదయం మరో ఆరు మృతదేహాలను గుర్తించారు. ఇంకా కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతులు, క్షతగాత్రులు బీహార్, ఒడిసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఎక్కడి నుండో తమ కుటుంబాలను వదలి పొట్ట కూటికోసం వచ్చి దారుణంగా ప్రాణాలు కోల్పోవడం అందరిని కలచివేస్తుంది.
