సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం రాజమహేంద్ర వరం నగరానికి సమీపంలో అనుమానస్వదా రీతిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం పోస్ట్ మార్థం జరుగుతున్నా నేపథ్యంలో వేలాదిగా చేరుకొన్న ఒక సామజిక వర్గం ప్రజల ఆందోళనలతో.. ఒక రకమైన టెంక్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ కు చెందిన మత ప్రబోధకుడు ను ఎవరో హత్య చేసారని అనుమానిస్తూ ఆ వర్గం ప్రజలు చాల మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదంలో మరణించినట్లు పోలీస్ వర్గాలు ముందు భావించాయి.. అక్కడకు కె ఏ పాల్ కూడా చేరుకొన్నారు. ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అలాగే ప్రతి పక్ష నేత జగన్ కూడా ప్రవీణ్ మరణానికి తీవ్ర సంతాపం తెలుపుతూ ప్రజలలో నెలకొన్న అనుమానాల నివృత్తికి పూర్తీ స్థాయి దర్యాప్తు జరగాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *