సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలకు ముందు వాలంటీర్లు సేవలపై ఎన్నికల సంఘం నిషేధం విధించడం తో ఏపీలో వృద్దులకు ఇచ్చే పింఛన్లు స్థానిక వార్డు సచివాలయ దగ్గరకు వెళ్లి తీసుకొనే పరిస్థితి ఫై లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. దానికి కారణం టీడీపీ వర్గాల పిర్యాదులే అని భావిస్తూ వాడవాడలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో..వైసీపీ వర్గాలు ప్రచారం అడ్డుకోవడానికి చంద్రబాబు స్వరం తో దీనిపై పలువురికి ఫోన్ కాల్స్ ప్రచారంలో వివరణ ఇస్తుండటం ఈ సమస్య తీవ్రత తెలియజేస్తుంది. అయితే ఇదిలా ఉండగా తాజాసమాచారం ప్రకారం.. ఏపీలో వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీని నిలువరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వలంటీర్లు వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా ?అని వాఖ్యానించారు. వలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులు మేరకు ఈసీఐ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్ళలేని వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్ళి అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. సజావుగా పెన్షన్ల పంపిణీకి ఈసీఐ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ పిల్‌ను కొట్టివెస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
