సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ పర్యాటన నేపథ్యంలో పిఠాపురంలో జనసేన సభ వద్ద పోలీసులు కు జనసేన క్యాడర్ కు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కు మధ్య తీవ్ర వాగ్వాదం ఉద్రిక్తత చోటు చేసుకొంది (ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో పవన్ చుట్టూ భద్రతా ను పోలీసులు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు) పవన్ వచ్చారని సభ లోపలికి వెళ్లేందుకు వచ్చిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జనసేన మహిళా కో ఆర్డినేటర్ చల్లా లక్ష్మిని అడ్డుకోవడంలో ఆమెను పోలీసులు నెట్టేశారు. కిందపడిన లక్ష్మి తలకు గాయమైంది. దానితో పోలీసుల దూకుడుగా వ్యవహరిస్తున్నారని స్థానిక జనసేన కార్యకర్తలు అక్కడే ఆందోళన వ్యక్తం చేసారు. మరోవైపు పవన్ పిఠాపురం సభలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను కూడా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతను స్థానిక మాజీ ఎమ్మెల్యేని అని చెప్పినా వినకుండా పోలీసులు లోనికి వెళ్లనీయలేదు. దీంతో పోలీసులపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పొమ్మంటే వెళ్ళిపోతానంటూ వర్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తరవాత ఫై అధికారులు కలుగజేసుకొని తన అనుచరులతో కలిసి వర్మ సభ లోపలికి పంపారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా పశువుల రక్షణకు మినీ గోకులాల షెడ్లను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న నేపథ్యంలో .. కుమారపురంలో మినీ గోకులాన్ని ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు.
