సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు, మంగళవారం నామినేషన్ దాఖలు చేసారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని తన నివాసం నుంచి ఆయన అభిమానులతో భారీ ర్యాలీగా ( ఫై ఫొటోలో)బయల్దేరారు. పవన్ మువ్వన్నెల జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది. పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం పవన్ ప్రత్యే క కాన్వాయిలో వెళ్లి రిటర్నింగ్ అధికారి (ఆర్వో ) కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు.
