సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మునిసిపాలిటీలలో ఏ మాత్రం బలం లేకపోయిన ఎదో రూపేణా కీలక పదవులు అధిష్టిష్టించే దిశగా తమతో కొత్తగా జత కట్టిన వైసీపీ అసంతృప్త సభ్యుల సహకారంతో ( వారిలో చాల మంది ప్రస్తుతం తమ స్వంత పనుల కోసం అధికార బలం కోసం టీడీపీ షెల్టర్ కోసం వస్తున్నవారే ఎక్కువ అని. టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడిన స్థానిక నేతలే అసంతృప్తి తో ఉంటున్నారు.. ఇటీవల తిరుపతి ఉప మేయర్ ఎన్నిక జరిగిన తీరుకు అందరు విస్తుపోయారు. ) టీడీపీ ఇటీవల పావులు కదుపుతూ దాదాపు 10 మునిసిపాలిటీలలో ఫలితాలు సాధించిన దశలో గతంలో వాయిదా పడిన తుని, పిడుగరాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులకు నేడు, సోమవారం ఎన్నికలు అధికారులు నిర్వహించారు.. అయితే తునిలో వైసీపీ సభ్యులు ఇది అనైతికమని ఆందోళనకు దిగటంతో కౌన్సిల్ హాల్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సమావేశానికి వచ్చిన టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ నేత దాడి శెట్టి రాజా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని మాత్రం ఎట్టకేలకు టీడీపీ కైవసం చేసుకుంది. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. వైసీపీ ఆందోళలన్ ల మధ్య పురపాలక సమావేశానికి మొత్తంగా 33 కౌన్సెలర్స్ ఉండగా కేవలం 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వైస్ ఛైర్మన్‌గా 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఉన్న భారతిని సభకు వచ్చిన కౌన్సిలర్లు ఏకగ్రీవ మద్దతు తెలిపారు.
