సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వీరవాసరం ఎంఆర్ కె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనేడు, శనివారం ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ను ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేవి సైన్స్ ఫెయిర్ లేనని, పిల్లల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని , రాష్ట్రం, దేశం అభివృద్ధి విద్య వలన సాధ్యం అవుతుందని, విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో మౌలిక వసతులు కల్పిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజా ప్రయోజనాలకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్నారు. పాఠ్యపుస్తకాల నుండే సాంకేతికత అంది వస్తుందని, వాటిని బాగా చదివి ఆకళిoపు చేసుకోవాలన్నారు. విజ్ఞాన సదస్సులు ఏర్పాటు వలన విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన, పరిశోధనల పట్ల ఉత్సుకత ఏర్పడుతుందన్నారు. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపికైన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయిలో దక్షిణ భారత స్థాయిలో సైన్స్ ఫెయిర్ విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 20 మండలాల స్థాయిలో నిర్వహించిన పోటీలలో 20 మండలాల నుండి మూడు విభాగాలలో వ్యక్తిగత విభాగం, బృందవిభాగం, ఉపాధ్యాయ విభాగంలో జిల్లాస్థాయికి ఎంపికైన 60 ప్రదర్శనలను అడిగి తెలుసుకున్నారు. భీమవరం ఆర్డీవో కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ నారాయణ, ఎస్ఎస్ఏ ఏపీసి పి శ్యామ్ సుందర్, జిల్లా సైన్స్ అధికారి విఎంజెడ్ శ్యామ్ ప్రసాద్, జడ్పిటిసి గుండా జయ ప్రకాష్ నాయుడు,తాహసిల్దార్ రామాంజనేయులు, టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *