సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరి కోట, ఇస్రో (ISRO) నుంచి నేడు, మంగళవారం ఉదయం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వి-సి 60 (PSLV-C 60) అంతరిక్షంలోకి దూసుకొని పోయింది. అనుకున్న సమయానికి ప్రయోగం విజయవంతం అయ్యి అంతరిక్షంలో భారత్ సత్తా మరో సారి చాటిచెప్పటం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయోగంతో .. కక్ష్యలో స్పేస్ డాకింగ్ ప్రయోగం విజయవంతం అవడం ఆర్బిటాల్ డాకింగ్‌లో భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తోందన్నారు. ఇది మానవ సహిత అంతరిక్ష యానానికి, ఉపగ్రహాల మెయింటినెన్స్‌కు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఈ మిషన్ సక్సెస్ కావడంతో చంద్రయాన్ 4, చంద్రుని నమూనాలతో తిరిగి రావడం, భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి లక్ష్యాలకు మరింత చేరువయ్యింది.
