సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు.. ఆంధ్ర ప్రదేశ్ లో పీఏసీ చైర్మెన్ గా భీమవరంలోని జనసేన ఎమెల్య పులపర్తి అంజిబాబు ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుండి సమాచారం అందింది. నిజానికి సంప్రదాయంగా వస్తున్నా పద్దతి ప్రకారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి పీఏసీ చైర్మెన్ పదవి వస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్ ఈ పదవి నిర్వహించారు. అదే పద్దతి ప్రకారం ఈసారి వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి పీఏసీ చైర్మెన్ పదవి ఆసిస్తూ నేడు ఏపీ అసెంబ్లీ కి వచ్చి నామిషన వేశారు. అయితే ప్రతిపక్ష హోదా లేని వైసీపీ నేతకు పదవి ఇవ్వడంపై ఎన్డీయే కూటమి పార్టీలు అభ్యన్తరం వ్యక్తం చేసాయి.ఈ ఎన్నికపై (PAC Election) ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయించాయి.తొమ్మిది నామినేషన్‌లు మాత్రమే దాఖలైతే పీఏసీ ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం కానుంది. పీఏసీలో ఉండాల్సిన సభ్యులకంటే ఒక నామినేషన్ ఎక్కువ దాఖలు కావటంతో (ఎన్డీఏ నుంచి 9 మంది, వైసీపీ నుంచి ఒకటి కలిపి ) మొత్తం 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బలం అవసరం. కానీ నామినేషన్ దాఖలు చేసిన వైసీపీకి ప్రస్తుతం 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. అయితే తొమ్మిది మంది సభ్యులు పీఏసీకి ఎన్నికై వెళ్తారు. తరువాత ప్రతిపక్షం నుంచి ఎవరైనా సభ్యుడు వస్తే అతడికి చైర్మన్‌గా నిర్ణయించి బాధ్యతలు అప్పచెబు తారు. కానీ.. వైసీపీ కి కనీసం 20 మంది సభ్యుల బలం లేకపోవడంతో వారు అర్హత కోల్పోయినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
