సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అచ్చ తెలుగువాడు భారత మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి మొత్తం 4గురికి.. వారి తరపున కుటుంబ సబ్యులకు నేడు శనివారం ప్రధాని మోడీ సమక్షంలో ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. మొత్తం ఐదుగురికి కేంద్రప్రభుత్వం భారత రత్నలు ప్రకటించగా.. బీజేపీ సీనియర్ నేత అద్వానీ అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేదు. ఆయన నివాసానికి వెళ్లి ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా అద్వానీని సన్మానించనున్నారు. నలుగురికి మరణాంతరం ఈ పురస్కారాలు ప్రకటించగా.. వీరిలో ఇద్దరు మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు. భారత రత్నఅత్యున్నత పురస్కారం అందుకున్న పీవీ నరసింహరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, దేశ ప్రధాన మంత్రిగా పనిచేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీపడుతూ దేశం ఆర్ధిక పురోగతికి, విదేశాల నుండి ఆధునిక సౌకర్యాలు దిగుమతులకు ప్రజల జీవన ప్రమాణాలు పెరగటానికి పీవీ హయాంలోనే. బలమైన పునాదులు పడ్డాయి.
