సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వినుకొండ దారుణ అమానుష ఘటన దేశంలోనే టాప్ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రేండింగ్ కొనసాగుతుండగా.. నేడు, గురువారం పుంగనూరు లో మాజీ వైసీపీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు. ఈక్రమంలో టీడీపీ కూటమి నేతలు రెడ్డప్ప ఇంటికి చేరుకొని ఎంపీ మిదున్ రెడ్డి వెళ్లిపోవాలని నినాదానాలు చేస్తూ దూసుకొనివరావడం తో అక్కడే భారీ సంఖ్యలో ఆ భవనంలో సమావేశానికి హాజరు అయిన వైసీపీ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో త్రోపులాటలు, రాళ్ల దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఎంపీ మిదున్ రెడ్డి కారు, ఇతర వైసీపీ నేతల కార్లు ద్వంసం అయ్యాయి. పరిస్థితి శృతిమించడంతో ఎంపీ మిదున్ రెడ్డి గన్ మెన్ గాలిలోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారని సమాచారం. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి నుంచి రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. అయితే ఎంపీ మిదున్ రెడ్డి మాత్రం ససేమిరా .. నేను టీడీపీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా?వాళ్ళ ఆజ్ఞలతో పనిచేసేవాడిని కాదు..రెడ్డప్ప ను, ఇక్కడ వైసీపీ కార్యకర్తలను కలవద్దు అనడానికి వాళ్లెవరు? నా హక్కులను రక్షించుకొంటాను అంటూ రెడ్డప్ప ఇంటిలోనే ఉండిపోయారు. అక్కడ ఇరుపక్షాల రాళ్ల దాడులలో తీవ్రంగా గాయపడిన ఒకరిద్దరిని తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి తరలించారు.
