సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆసియా స్టాక్ మార్కెట్ల (stock markets) పెరుగుదల నేపథ్యంలో భారతీయ ఈక్విటీ సూచీలు దూసుకొనిపోయాయి. సెన్సెక్స్ నేటి శుక్రవారం (డిసెంబర్ 27) ఉదయం 10.20 గంటలకు 544 పాయింట్లకు పైగా లాభంతో 79,025.62 స్థాయిలో ట్రేడైంది. ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 180 పాయింట్లు పెరిగి 23,927 పాయింట్ల వద్ద ఉండగా, బ్యాంక్ నిఫ్టీ 410, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 79 పాయింట్లు చేరుకొంది. .దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, M&M కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఇక , పవర్ గ్రిడ్ కార్ప్, HCL టెక్, TCS, భారత్ ఎలక్ట్రిక్, లార్సెన్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. నేడు, శుక్రవారం బంగారం (gold), వెండి (silver) ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న తగ్గిన బంగారం ధరలు, ఈరోజు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,050 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,629కు చేరింది. ఇక వెండి రేట్ల గురించి మాట్లాడితే కిలో వెండి రూ. 400 పెరిగి రూ. 89,760 స్థాయికి చేరుకుంది
