సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చేతులు కాలాక ఆకులూ పట్టుకొన్నాడట.. మొత్తం గల్ఫ్ ప్రాంతం అగ్నిగుండంగా మారిపోవడంతో..అమెరికాతో సహా, ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయి గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో తన పట్టు తప్పిపోయిందని తెలుసుకొన్న అమెరికా అడ్జక్షుడు ట్రంప్ తాజా గా రష్యా అడ్జక్షుడు పుతిన్ తో గంటకు పైగా ఫోన్ లో చర్చలు జరిపారు. గల్ఫ్ శాంతికి సహకరించాలని అన్నారు.(ఇక చేసేది లేక ఇక నువ్వే దిక్కు అంటూ..)రష్యా నుండి పెట్రోల్ కొనుగోళ్ల ఫై ప్రపంచ దేశాలకు నిబంధనలకు సడలింపు కు ట్రంప్ అంగీకరించడంతో .. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు నేడు, మంగళవారం ఉదయం నుండి కాస్త కోలుకున్నాయి.ఇరాన్ యుద్ధం మరో వారం తరువాత ముగింపు గురించి ట్రంప్ మాట్లాడడంపాజిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ లో గత సోమవారం సెషన్ ముగింపు (77,566)తో పోల్చుకుంటే నేడు మంగళవారం ఉదయం దాదాపు 800 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ అదే జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10:30గంటల సమయంలోసెన్సెక్స్ 534 పాయింట్ల లాభంతో 78,100 వద్ద కొనసాగుతోంది. మరో వైపునిఫ్టీ కూడా . ప్రస్తుతం 166 పాయింట్ల లాభంతో24,183 వద్ద కదలాడుతోంది (stock market) బ్యాంక్ నిఫ్టీ 726 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 556 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.17గా ఉంది.
