సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా సమీపంలోని యూజికిస్తాన్ లో జరుగుతున్నా షాంఘై సహకార సంఘం ద్వైపాక్షిక సమావేశాల్లో చైనాతో సహా ఇటీవల దేశంనేతల అరుదయిన ముఖాముఖీ కలయిక జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని మోడీతో రష్యా అడ్జక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రస్తుతం యుద్ధం చేసే కాలం కాదని, ప్రపంచానికి కూడా మంచిదికాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు ఉక్రెయిన్లతో శాంతి చర్చలు ప్రారంభించాలని, యుద్ధం ఎంత త్వరగా ఆపితే అంత మంచిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. యుద్ధ సమయంలో భారత విద్యార్ధులను సురక్షితంగా తరలించేందుకు సహకరించినందుకు మోదీ పుతిన్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఇద్దరు నేతలూ ఆహారం, ఇంధన భద్రత, ఎరువులు సహా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. యుద్ధం ఆపాలన్న మోదీ సూచనపై స్పందించిన పుతిన్ మోడీతో మాట్లాడుతూ.. తాము కూడా సాధ్యమైనంత త్వరగా యుద్ధం ఆపాలనుకుంటున్నామని, సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరదించాలనుకుంటున్నామని చెప్పారు. ఇటివంటి ప్రపంచ సంక్షోభ వేళ భారత్ ప్రతిస్పందనను తాము అర్థం చేసుకోగలమని పుతిన్ చెప్పారు. ఈ సందర్భంగా పుతిన్… మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అతి త్వరలో రష్యాలో పర్యటించాలని పుతిన్ మోదీకి ఆహ్వానం పలికారు.
