సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అరుదయిన వ్యాధితో రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కర్నూల్ జిల్లాకు చెందిన పునర్విక కోసం భీమవరం రాయలం జనసేన పార్టీ జన సైనికులు, పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో రూ 2 లక్షల 65 వేలు విరాళాలు సేకరించి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగానేడు, సోమవారం అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతో జన సైనికులు వీర మహిళలు విరాళాలు సేకరించడం గొప్ప విశేషమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమన్నారు. చిన్న వయసులో స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జెన్యూ వ్యాధితో బాధపడుతోందని, కర్నూలుకు చెందిన పునర్వికా ట్రీట్ మెంట్ కు రూ 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలపడం అందరూ విరాళాలు సేకరించడం అభినందనీయమని, అన్నారు ఈ కార్యక్రమంలో రాయలం జన సైనికులు, వీర మహిళలు ప్రతిభ, పావని, పూర్ణిమ, ఉషా, దరాబత్తుల శ్రీనివాస్, గౌతమ్, కృష్ణ కాంత్, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *