సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ తో పొత్తు కొనసాగిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా ఆమె ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నా, కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవంతో విజయవంతంగా ముందుకు వెళ్తారని భావిస్తున్నాను’ అని అలాగే, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడిగా నియమితులైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి ఆయన అభినందనలు తెలియజేశారు.
