సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో నిన్న పోలింగ్ నాడు మీడియా లో ఎక్కడ చుసిన ఉద్రిక్తతలు మధ్య పులివెందుల, ఒంటిమిట్ట జడ్ పి టిసి లకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న తీరు న్యూస్ మీడియా చేనెల్స్ లో చూసి వీస్తు పోయిన తెలుగువారికి .. వారి అంచనాలకు తగినట్లే అధికార పార్టీ టీడీపీ గెలుపు సాధించింది. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో మొత్తం 10,601 ఓట్లు కాగా.. మొత్తం 7,814 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు పోలవ్వగా.. తీవ్ర బెదిరింపుల మధ్య తన ఓట్లు తానే వేసుకోలేకపోయిన వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. 30ఏళ్ల తరువాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి 100లోపు ఓట్లు లభించాయి. పులివెందుల లో తన విజయం ఖాయం కావడంతో ఎన్నికల అధికారి తో పత్రం అందుకొంటున్న టీడీపీ అభ్యర్థిని..
