సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసిపి అధినేత జగన్ కంచుకోట లో నేడు, మంగళవారం జరుగుతున్నా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తలు తలెత్తాయి. ఎట్టి పరిస్థితులలో జగన్ స్వంత నియోజకవర్గంలో జడ్పి టిసి లు కైవసం చేసుకోవాలని అధికారంలో ఉన్న కూటమి పెద్దలు అన్ని శక్తి యుక్తులు ప్రయోగిస్తుంటే.. మరో ప్రక్క తమ బలం నిరూపించుకోవడానికి వైసీపీ నేతలు కూడా హోరాహోరీ తలపడుతుండటం తో పలు చోట్ల ఇరు వర్గాల మధ్య జరుగుతున్నా దాడులతో ఆ ప్రాంతాలు తీవ్ర ఉద్రిక్తలు తలెత్తుతున్నాయి. తమ ప్రజలను ఓట్లను వెయ్యనీయకుండా పోలీసులే అడ్డుకొంటున్నారని టీడీపీ రిగ్గింగ్ చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ బయట నుండి వస్తున్నా వాహనాలను అడ్డుకొంటున్నారు. మరో వైపు టీడీపీ వాళ్ళు తమపై వైసీపీ వాళ్ళు దాడి చేసి తమ వాహనాలను దహనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పులి వెందుల లోని కానేపల్లె , అచ్చవెళ్లికి . మరోవైపు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లి గ్రామాలలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చింతరాజుపల్లె పోలింగ్‌ బూత్‌లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కణంపల్లిలోనూ పోలీసులు తమ ఓట్లు వెయ్యనీయడం లేదని స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. బయట ప్రాంతాల నుండి వ్యక్తులు పోలింగ్‌ కేంద్రాల్లోకి వచ్చారంటూ స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *