సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు సభలో మాట్లాడుతూ.. భీమవరం పట్టణంలో మధ్యలో గొస్తా నది – వేల్పూరు కాలువ వెళ్లిందని, ఈ కాలువకు వంతెన వేయాలని అన్నారు. ఈ వంతెన వేస్తే వన్ టౌన్ నుంచి త్రి టౌన్ కు 3 కిమీ కలిసి వస్తుందని, ఈ వంతెన ఎంతో అవసరమన్నారు. 2027లో రానున్న గోదావరి నది పుష్కరాలకు భీమవరంలోని పంచారామక్షేత్రమైన శ్రీసోమేశ్వర స్వామి ఆలయం, శ్రీమావుళ్ళమ్మ ఆలయం తదితర ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, తగిన రోడ్లు ఏర్పాట్ల వసతులు కు సిద్ధం కావలని అన్నారు.పుష్కరాల కాలంలో భీమవరం మున్సిపాల్టీలో సుమారు 10 రోడ్లు పనులను (రూ 1485 లక్షలు నిధులు ) పూర్తి చేయాలని కోరుతున్నామని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *