సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో కోట్లాది రూపాయల ఖర్చు, ఎంతో నిర్మాణ శ్రమ.. భారీ అంచనాలతో విడుదలయిన ఎర్రచందనం దొంగల కథతో నిర్మించిన ‘పుష్ప’ మూవీకి భారీ షాక్ తగిలింది. విడుదలైన కొద్ది గంటల్లోపై పుష్ప .. పైరసీ దొంగల బారిన పడింది. విడుదలైన కొద్ది గంటల్లోనే పుష్ప ఫుల్ మూవీ లింక్‌ను ఆన్‌లైన్‌లో పెట్టేశారు. చాలా కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప’ మూవీని కూడా లీక్ చేసేశాయి. దీనితో సినిమా నిర్మాతలు ఆందోళన కు లోనయినట్లు తెలుస్తుంది. ఈ పైరసీ బాధల నేపథ్యంలో పుష్ప త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు పుష్ప అమెజాన్ ప్రైంలోకి రానుందట?. థియేటర్లో విడుదలైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత పుష్ప ఓటీటీకి రానుంది. ఇప్పటికే దీనిని అమెజాన్ ప్రైం ఫ్యాన్సీ రేటుకు ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
