సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ రేపు శుక్రవారం పాన్ ఇండియా రిలీజ్ రేపు శుక్రవారం కావడం గమనార్హం. అయితే తగ్గేదేలే .. అన్నది అన్నిచోట్లా కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం..టికెట్స్ రేట్లు తగ్గించే అమ్మవలసిన పరిస్థితి థియేటర్స్ వారిది. ఇక నేడు, ఏపీ హైకోర్టు లో ధర్మాసనం సినిమా టికెట్స్ ఫై విచారణను సోమవారం కు వాయిదా వెయ్యడంతో ప్రభుత్వ పాత జీవో ప్రకారం తగ్గించిన టికెట్ రేట్లు అప్పటి వరకు అమలులో ఉంటుంది. ప్రేక్షకులకు నిజంగా పండగే.. నిజానికి సినిమా థియేటర్స్ ఎక్కువ శాతం ప్రముఖ నిర్మాతలు చేతిలోనే లీజ్ పేరుతొ నడపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి గురువారం సాయంత్రం వరకు పుష్ప ఆన్ లైన్ బుకింగ్ తెరుచుకోలేదు. తాజా సమాచారం ప్రకారం .. భీమవరం వంటి పట్టణంలో సైతం కేవలం 50 రూపాయల నుండి 100 రూపాయలు “సోపా” అయితే 120 రూ కు అమ్మవలసిన పరిస్థితి తలెత్తింది. స్రీన్ కు వచ్చి 4 ఆటలు మాత్రమే ప్రదర్శించాలి. ఏపీలో టికెట్ రేట్లు, షో లు పెరుగుతాయని కలెక్షన్స్ వరద పారుతుందని ఊహించిన ‘పుష్ప నిర్మాతలు, పంపిణి దారులకు వారి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఏది ఏమైనా కరోనా ఎఫెక్ట్ తరువాత ఇటీవల పూర్తి స్థాయిలో తెరుచుకున్న థియేటర్స్ తెలంగాణాలో సుమారు 600 ఉంటె, ఏపీ సుమారు 1600 ఉంటాయి. మరి ఏపీ ప్రభుత్వం తో సానుకూల వాతావరణం లో అగ్ర సినీ నిర్మాతలు, సినిమా థియేటర్స్ యాజమాన్యం చర్చలు జరిపితే బాగుండేదేమో? పుష్ప కు కొంత రిలీఫ్ ఏమిటంటే.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అథినేత దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వానికి చేసిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఐదో షోకి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. ఈ నెల 17 తేది నుంచి 30 వరకూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని థియేటర్లలోనూ ‘పుష్ప’ సినిమా ఐదు షోలు ప్రదర్శించేలా అనుమతి లభించింది…
