సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుష్ప ది రైజ్’తో హీరో అల్లు అర్జున్ ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా.. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్‌ని సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా.. భారత్, అమెరికాలోనే కాదు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలలో యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్’ సినిమా వచ్చే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల కు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. నేడు, బుధవారం తాజాగా ఈ సీక్వెల్ ఫస్ట్ పాటకు సంబంధించిన ప్రోమోని మేకర్స్ వదిలారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర పాటల్లోంచి మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. దీనికి సంబంధించిన 20 సెకండ్ల ప్రోమోను నేడు బుధవారం మేకర్స్ శాంపిల్ గా విడుదల చేశారు.
