సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజకీయ నేతల మీటింగ్ లకు వెళ్లి త్రొక్కిసలాటలో ఎందరో అమాయకులు మరణించిన ఘటనలు కోకొల్లు.. కానీ మీటింగ్ కు వచ్చిన నేత ఎక్కడ అరెస్ట్ కారు.. ఆ నేతలు ఆహూతులకు సౌకర్యాలు కల్పించపోయిన అది పోలిసుల అసమర్ధత గా తేల్చి పారేస్తారు. అయితే వీటికి బిన్నంగా ‘పోలీస్ పర్మిషన్ తీసుకోనందుకు‘ కీలక అంశంగా పరిగణించి .. ఈనెల 4వ తేదీ రాత్రి సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా చూడటానికి వచ్చి అక్కడ అల్లు అర్జున్ ను చూడటానికి వచ్చిన అభిమానుల త్రోపులాటలో ఒక మహిళా మరణించడం ఆమె కుమారుడు నలిగిపోయి గాయాలు పాలయిన విషాద ఘటన కేసులో నేడు, శుక్రవారం మధ్యాహ్నం హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో ఇంట్లో టీ షార్ట్ తో ఉన్న అల్లు అర్జున్ దుస్తులు మార్చుకోవాలని కోరగా వారు ఆయన బెడ్ రూమ్ వరకు వచ్చి షార్ట్ మార్చుకొన్నాక పోలీస్ స్టేషన్ కు తీసుకొనివెళ్ళటం తో అల్లు అర్జున్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ను నిందితుల్లో ఒకరిగా గుర్తించి బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద నాన్ బెయిల్ బుల్ గా పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
