సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుష్ప.. 2 సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల కోసం ఒక పాటకు సంబందించిన క్లిపింగ్స్ యూ ట్యూబ్ లో వదిలారు. ఒక పక్క ఎన్నికల హడావుడి. మరో పక్క బన్నీ పుష్పరాజ్ హంగామా. దేవీశ్రీప్రసాద్ మళ్ళీ మాస్ టచ్ తో సూపర్ బీట్స్ తో తన సత్తా చూపించాడు. సుకుమార్ మార్క్ ఈరోజు విడుదలైన పుష్ప 2 ది రూల్ సినిమాలోని పుష్ప.. పుష్ప రాజ్ పాట అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. బన్నీ డాన్స్ మూమెంట్స్ ఎంజాయ్ లో పడి సాధారణ ప్రేక్షకులు గమనించలేదు కానీ.. సరిగ్గా ఎన్నికల సమయంలో టైమ్ చూసి మా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి పరోక్షంగా మద్దతు తెలుపుతూ… తన డాన్స్ మూమెంట్స్ తో టీ గ్లాస్ పట్టుకొని తన వంతు ప్రచారం చేసాడని జనసేన అభిమానులు మురిసిపోతున్నారు. మెగా కుటుంబం అంతా పవన్ వెనుకే ఉంది అని మురిసిపోతున్నారు. విషయం ఏమిటంటే.. పుష్పరాజ్ డాన్స్ చేస్తూ టీ గ్లాస్ పట్టుకుని రెండు తిప్పులు తిప్పి.. టీ గ్లాస్ పైకెత్తి.. కిందకి దింపి స్టైల్ గా టీ తాగుతూ స్టెప్ వేశాడు. అంతే..
