సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పార్వతీపురం జిల్లా, కురుపాంలో ‘అమ్మవడి‘ విద్యార్థుల తల్లుల ఖాతాలలో డబ్బు జమా బటన్ నొక్కక సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓటు హక్కు లేని విద్యార్థుల కోసం వారి ఉన్నత భవిషత్తు కోసం, ప్రజా సంక్షేమం కోసం ఇన్ని పధకాలు అవినీతి లేకుండా అమలు చేస్తుంటే.. అటు చంద్రబాబు ఆయన దత్త పుత్రుడు జీర్నించుకోలేకపోతున్నారని, మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని విమర్శించారు. ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడు అయితే వారాహి అనే లారీ ఎక్కి పూనకంతో ఊగిపోతున్నారని, తన ప్యాన్స్ నుండి స్వాందన కోసం నోటికి వచ్చినట్లు బూతులు తిడుతున్నాడని, మాట్లాడితే చెప్పుతో కొడతా, తాట తీస్తా. తోలు వలిచేస్తా .. అంటున్నారని, ఆ మనిషికి నిలకడ లేదు.. ఆయన నోటికి అదుపులేదని సీఎం జగన్ దుయ్యబట్టారు. 15 ఏళ్ల క్రితమే చంద్రబాబు కోసం దత్తపుత్రుడు రాజకీయాలకు వచ్చాడని, ప్రజలకు ఏమి మేలు చేసాడని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హామీ అమలు చేయలేనప్పుడు ఏమి ప్రశ్నించాడని విమర్శించారు. దత్తపుత్రుడిలా పూనకం వచ్చినట్లు మనం మాట్లాడలేమని, వాళ్లలా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని భార్యలను వదిలేయలేమని అన్నారు. నాలుగేళ్లకు ఒకసారి మరల పెళ్లి చేసుకొని, ఇలా పెళ్లి అనే బంధాన్ని రోడ్లపైకి తీసుకురాలేమని, ఇలాంటివన్నీ దత్తపుత్రుడికే పేటెంట్ హక్కులని అని సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. .
