సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచం లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా భాసిల్లుతున్న ఒడిశా పూరీలో జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra ) సందర్భంగా నేడు, ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో శ్రీగుండిచా ఆలయం సమీపానికి లక్షలాది మంది భక్తులు దైవ దర్శనానికి ఒక్కసారిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, మరో 10 మందికి పైగా గాయపడ్డారు. మహా ఉత్సవాన్ని ఆనందంగా ప్రారంభించేందుకు వచ్చిన భక్తుల ఆశలు క్షణాల్లోనే విషాదంగా మారాయి. ఈ ఘటన సమయంలో రథంపై కూర్చున్న జగన్నాథుడిని దర్శనం కోసం జనాలు భారీగా తరలివచ్చారు. జన సమూహాన్ని నియంత్రించడం అక్కడి సిబ్బందికి చాలా కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తింది. మృతులందరూ ఖుర్దా జిల్లాకు చెందినవారని… మృతుల్లో ఇద్దరు మహిళలు ప్రభాతి దాస్, బసంతి సాహు ఉన్నారు. మృతుల్లో 70 ఏళ్ల ప్రేమకాంత్ మహంతి కూడా ఉన్నారు.
